ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి పంచాయితీ ఎలక్షన్. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో కార్మికులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. అయితే.. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ సోము వీర్రాజు అని కె రామకృష్ణ ఫైర్ అయ్యారు. హిందుత్వాన్ని పక్కన పెట్టేందుకు విశాఖ ఉక్కు ఉద్యమం తీసుకువచ్చారని చెప్పడం అవివేకమని మండిపడ్డారు. ఢిల్లీలో సోము వీర్రాజుకి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. వారి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రధాని అధ్యక్షతన ఎకనామిక్స్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగిన విషయం వాస్తవమా కాదా? అని నిలదీశారు. ఆ మీటింగ్లోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 100% ప్రైవేటుపరం చేయాలని నిర్ణయం తీసుకున్నారని.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై బీజేపీ కుట్రలను ప్రజలు క్షమించరని హెచ్చరించారు రామకృష్ణ.
previous post
చంద్రబాబుకు ఫేస్ వాల్యూ లేదు: లక్ష్మీపార్వతి