ప్రపంచ కప్ లో భాగంగా నేడు వెస్టిండీస్-ఆఫ్ఘనిస్థాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ (7) విఫలమైనా, ఎవిన్ లూయిస్ (58), షై హోప్ (77), హెట్మెయర్ (39), నికొలాస్ పూరన్ (58), కెప్టెన్ జాసన్ హోల్డర్ (45) బ్యాట్ తో రాణించారు.
ఫోర్లు, భారీ సిక్సులతో ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. కెప్టెన్ హోల్డర్ ఒక్కడే నాలుగు సిక్సులు బాదాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో దౌలత్ జాద్రాన్ కు 2 వికెట్లు దక్కగా, షిర్జాద్, నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

