telugu navyamedia
సినిమా వార్తలు

విలన్ గా మారిన ప్రముఖ సంగీత దర్శకుడు

Palasa

రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న “పలాస 1978” చిత్రం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న “పలాస 1978” చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తున్నారు. యాంకర్‌గా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రఘు కుంచె తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు. ఫస్ట్ లుక్‌తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిన “పలాస 1978” మూవీలో రఘు కుంచె విలన్‌గా కనిపించబోతున్నారు. అది కూడా సాదా సీదా విలన్ పాత్ర కాదు. నాలుగు డిఫరెంట్ షేడ్స్‌లో చాలెంజింగ్ పాత్ర చేయబోతున్నారు. ఈ క్యారెక్టర్‌లో నాలుగు డిఫరెంట్ ఏజ్‌లు చూపించే పాత్రను రఘు చేస్తున్నారు. ఈ సినిమాలో 30-40-50-70 ఏజ్‌లలో ఆయన కనపించబోతున్నారు. “పలాస 1978″కు రఘు కుంచె మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుండటం మరో విశేషం. ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్‌కు, రఘు విలన్ పాత్రకు సూటవుతారని అనిపించిందట. అంతే వెంటనే రఘు కుంచె విలన్‌గా మారిపోయారు.

Related posts