అనుష్క మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సరైన సమాధానం మాత్రం రావడం లేదు. పైగా ప్రభాస్‌తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేస్తుందనే వార్తలు కూడా ఉన్నాయి. దీనిపై అటు ప్రభాస్.. ఇటు అనుష్క నో అనే సమాధానాలే చెప్పారు. అయినా కూడా వీళ్ల మధ్య రూమర్స్ ఆగడం లేదు. ఇక ఇప్పుడు వీటన్నింటికీ సమాధానాలు వస్తున్నాయి. అనుష్క పెళ్లి ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తుంది. ప్రస్తుతం జేజమ్మ మనసు అంతా సినిమాలపైనే ఉంది. ప్రస్తుతం కోన వెంకట్ నిర్మాణంలో ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తుంది ఈ భామ. ఇందులో రంగస్థలంలో రామ్ చరణ్ చేసినట్లు ఛాలెంజింగ్ పాత్ర ఇది. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఎప్రిల్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉంటే తన పెళ్లి ఇప్పట్లో ఉండదని మరోసారి క్లారిటీ ఇచ్చింది అనుష్క. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ రావుతో అనుష్క పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై కూడా ఈమె స్పందించింది. మొన్నీమధ్యే అనుష్క 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ అప్పుడు తన పెళ్లి గురించి మాట్లాడింది ఈ ముద్దుగుమ్మ. ఆయనతోనే మీ పెళ్లంట కదా అని అడిగితే.. అలాంటిదేం లేదు.. అతడితో నాకు పెళ్లేంటి అని సమాధానమిచ్చింది. పెళ్లి చేసుకుంటే చెప్పే చేసుకుంటానంటూ క్లారిటీ ఇచ్చింది. దీనిపై అనుష్క చాలా సీరియస్‌గా స్పందించిందని తెలుస్తుంది. కనీసం చెప్పేవరకు కూడా ఆగలేరా అంటూ మీడియాపై కూడా ఆమె సీరియస్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.