telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోహన్ లాల్ “రామ్”లో త్రిష

ram

చెన్నై పొన్ను త్రిష తమిళ్‌లో ‘96’ తో సూపర్ డూపర్ హిట్ అందుకుని మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం మలయాళంలో ‘రామ్’ అనే సినిమా చేస్తుంది. నివీన్ పౌలితో నటించిన ‘హే జూడ్’ సినిమాతో మలయాళ పరిశ్రమకి పరిచయం అయిన త్రిష ఇప్పుడు మల్లూవుడ్‌లో తన సెకండ్ మూవీ చేస్తుంది. ‘దృశ్యం’ తర్వాత కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘రామ్’ అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ‘రామ్’లో త్రిష కథానాయికగా నటిస్తోంది. మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్‌తో నటించడం చాలా ఆనందంగా ఉందని త్రిష తెలిపింది. ఈ చిత్రంలో త్రిష డాక్టర్ క్యారెక్టర్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ కీలక పాత్రలో కనిపించనుండగా, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. సాయి కుమార్, దుర్గ కృష్ణన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సియారా, ఉజ్బెకిస్తాన్, యూకే, ఢిల్లీ, చెన్నై, కొలంబో అండ్ కొచ్చి వంటి వివిధ లొకేషన్లలో ‘రామ్’ షూటింగ్ జరుపనున్నారు. ఈ ఏడాది ఓనమ్ పండుగకు ‘రామ్’ విడుదల కానుంది.

Related posts