telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ తో త్రివిక్రమ్ సినిమాకు భారీ డీల్

Ram-Pothineni

“అల.. వైకుంఠపురములో” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్.. తన తర్వాతి సినిమాని తారక్‌తో తెరకెక్కించనున్నారు. ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో `అరవింద సమేత` సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” పూర్తి చేసేలోపు త్రివిక్రమ్ మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఆ సినిమా కోసం త్రివిక్రమ్… యంగ్ హీరో రామ్ ను సెలక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ కాంబోపై వస్తున్న సినిమా కోసం భారీ రేంజ్‌లో డీల్ కుదిరిందని తెలుస్తోంది. త్రివిక్రమ్.. హీరో రామ్ రిక్వెస్ట్ మేరకు ఓ కథ సిద్ధం చేశారని సమాచారం. జులాయి మూవీ టైప్‌లో కథ కావాలని రామ్ కోరారట. అయితే ఈ కథ కోసం త్రివిక్రమ్ ఏకంగా 10 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించడం సందేహమే గానీ స్క్రీన్ ప్లే మాత్రం ఆయనే అందిస్తారని తెలిసింది. మొత్తంగా చూస్తే ఈ మూవీ నిర్మాణం కోసం 45 కోట్లు అవసరమవుతాయనే విషయం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. హీరో రామ్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’‌తో తిరిగి ట్రాక్ ఎక్కాడు. అదే ఎనర్జీతో ఇటీవలే ‘రెడ్’ సినిమా పూర్తి చేశాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఏ సినిమా ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్- రామ్ కాంబోలో సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందా? అని అంతా ఎదురు చూస్తున్నారు.

Related posts