telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క‌రోనా క్రైసిస్ చారిటీకి రూ.10 ల‌క్షల విరాళం ప్రక‌టించిన గోపీచంద్

gopichand

మ్యాచో హీరో గోపీచంద్ క‌రోనా క్రైసిస్ చారిటీకి రూ. 10 ల‌క్షల విరాళం ప్రక‌టించి తన మంచి మనసును చాటుకున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఉపాధి లేక ఇబ్బందులు ప‌డుతున్న కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి త‌న వంతు చేయూత‌ను అందించ‌డానికి ఆయ‌న ముందుకు వ‌చ్చారు. గోపీచంద్ రోజూ 1500 మంది అనాథ‌ల‌కు రెండు నెల‌ల పాటు ఆయ‌న అన్నదానం చేస్తుండ‌టం విశేషం. కాగా, గోపీచంద్ చేస్తోన్న ఈ మంచి పనుల పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో గోపీచంద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం సినీ కార్మికుల గురించే కాకుండా పేదలు, అనాథల గురించి కూడా ఆలోచించి, వారికి సాయం చేయడం గొప్ప విషయమని కొనియాడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు.

Related posts