telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే ?

exam hall

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రస్తుతం చాలా రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ గత వారం రోజులుగా 3 వేలు మించకపోవడం శుభ పరిణామం. ఈ నేపథ్యంలో.. జూన్‌ నెలాఖరులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని కెసిఆర్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. అవకాశం ఉంటే జూన్‌ నెలాఖరులో పరీక్షలు జరుపుతామని, లేని పక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకుంటున్నామని ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా వారికి చెప్పినట్లు సమాచారం. రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు లేకుంటే ప్రథమ సంవత్సరం పరీక్షల్లో మార్కుల ఆధారంగా ఇవ్వడం లాంటి వాటిని పరిశీలిస్తున్నామని వివరించినట్లు సమాచారం. ఈ ప్రత్యామ్నాయ మార్గాలపై ఇంటర్‌బోర్డు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించిన ప్రభుత్వం జూన్‌ 1న సమీక్షించి అప్పటి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Related posts