telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సహించే విధంగా కార్యచరణ : చైర్మన్ లంకా దినకర్

అత్తలూరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎఫ్పిఓ సంస్థ సంబంధించిన కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్యాంద్రప్రదేశ్ గా మార్చాలనే సిఎం లక్ష్యాన్ని చేరుకుంటాం అని తెలిపారు.

రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సహించడానికి ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కు తీసుకోవాల్సిన చర్యల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి నివేదిక సమర్పించనున్నానట్లు  చైర్మన్ లంకా దినకర్ తెలిపారు.

ఆయన నేతృత్వంలో ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శేవల దత్తు , అత్తలూరి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎఫ్పీఓ వ్యవస్థాపకులు నూతలపాటి సురేంద్ర , ఆర్గానిక్ ఫార్మింగ్ నిపుణులు శరత్ కుమార్ రెడ్డి పెద్దకూర పాడు నియోజకవర్గం అత్తలూరు లోని అత్తలూరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎఫ్పిఓ సంస్థ సంబంధించిన కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని సచివాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమరావతీ చుట్టూ 75 లక్షల మొక్కల పెంపకం కోసం రైతుల భాగస్వామ్యం చేసేందుకే కార్యచరణ చేయనున్నామని, అత్తాలూరు ఆర్గానిక్ ఫర్మింగ్ ను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ లో ఆర్గానిక్ ఫామింగ్ పై రైతులను ప్రోత్సహించే విధంగా కార్యచరణ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

అపోహలను తొలగించి పురోగతి దిశగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామనీ, ఉన్నత విద్యావంతులు పీఎం సూర్యాగర్ పై ప్రజల్లో అవగాహణ కల్పిస్తున్నారని పిఎం సూర్యగర్ ద్వారా విద్యుత్ చార్జీలు గతంలో రూ.1500-2000 ఉంటే ఇప్పుడు సూర్యాగర్ వినియోగం ద్వారా రూ 300-400 చార్జీలు పరిమితం అయ్యాయని అక్కడి యువత తెలిపారని పేర్కొన్నారు.

విజయనగరం జిల్లాలో త్వరలోనే అక్కడి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు సమక్షంలో పైలెట్ ప్రాజెక్టుగా ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించినటువంటి కార్యాచరణకు శ్రీకారం చుటనున్నామని తెలిపారు.

రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రీయ పంటలు పండించేందుకు ప్రోత్సాహం దిశగా రైతులకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శేవల దత్తు తెలిపారు.

అత్తలూరిలో సేంద్రియ పంటలు పండించి వాటి ద్వారా పచ్చళ్ళు, కారం, నూనె మొదలగు వాటిని అక్కడి రైతులు ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు.

200 పై చిలుకు అవులతో గోశాలలో ఏర్పాటు చేసి పాల ఉత్పత్తి చేస్తున్నారని బాగా డిమాండ్ ఉండటంతో అక్కడ సగటు మూడు లీటర్ల అవసరం ఉంటే 1 లీటర్ మాత్రమే ఉత్పత్తి చేస్తూన్నారని తద్వారా నాణ్యమైన ఉత్పత్తులకు ఉన్న డిమాండు అందరూ గమనించాలని తెలిపారు.

రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్యంద్రాప్రదేశ్ గా మార్చాలనే సిఎం ఆలోచనను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రతీ పంటను ప్రకృతి వ్యవసాయం వెైపు మల్లిస్తామని 100 శాతం ఆర్గానిక్ ధృవీకరణ పంటల ఉత్పత్తి దిశగా సేంద్రియ ఉత్పత్తులు పై సమగ్ర నివేదిక ఇవ్వనున్నాట్లు తద్వారా
ప్రకృతి వ్యవసాయం ద్వారా గ్లోబల్ వర్మింగ్ అరికట్టవచ్చని తెలిపారు.

Related posts