బిగ్ బాస్ హౌస్‌లో మోనాల్, అభిజిత్, అఖిల్ మధ్య రొమాంటిక్ ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ నడుస్తున్న విషయం తెలిసిందే. అలకలు, కోపాలు, గొడవలు, హగ్‌లు ఇవన్నీ ఈ ముగ్గురి మధ్యే ఎక్కువగా జరుగుతున్నాయి. మొదటి నుంచి అఖిల్, అభిజిత్, మోనాల్‌ల మధ్య ఏదో జరుగుతూనే ఉంది. మోనాల్‌పై ఈ ఇద్దరు ఆసక్తిని చూపుతుండగా.. ఆమె కూడా ఈ ఇద్దరితో క్లోజ్‌గా ఉంటోంది. ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయంలో నీదే అసలు తప్పంటూ దివి, మోనాల్‌ని ఎదురుగానే అడిగేసింది. ఇదిలా ఉంటే హౌజ్‌లో అఖిల్ లవ్‌పై అతడి తల్లిదండ్రులు అంత సంతృప్తిగా లేరు. ఈ విషయాన్ని అఖిల్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక అఖిల్ తల్లి సైతం మోనాల్‌తో లవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌజ్‌లో నుంచి అఖిల్ రాగానే, అతడికి ఓ అందమైన తెలంగాణ అమ్మాయితో పెళ్లి చేస్తామని అఖిల్ తల్లి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం అఖిల్‌కి సంబంధాలు చూస్తున్నామని, అఖిల్ తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని చెబుతున్నారు. చూస్తుంటే ఒకవేళ అఖిల్, మోనాల్‌ని సీరియస్‌గా లవ్ చేసినా.. వారిద్దరి పెళ్లి చేసేందుకు అఖిల్ తల్లిదండ్రులు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సీజన్లో పులిహోర రాజాగా పేరు తెచ్చుకున్న అభిజిత్.. మోనాల్‌తో పాటు అటు హారికతోనూ రొమాన్స్ చేస్తున్నాడు. అయితే అఖిల్ మాత్రం మోనాల్‌కి ఫిక్స్ అయ్యాడు.
previous post
next post
శ్రావణి ఆత్మహత్య : సంచలన విషయాలు బయటపెట్టిన దేవరాజ్