telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాల పై పాలకమండలి కీలక నిర్ణయం

దుర్గగుడి దసరా ఉత్సవాల నిర్వహణ నిమిత్తం సమావేశం అయిన దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై పాలకమండలి సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను చైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్ బాబులు ఆవిష్కరించారు. 37 అంశాలు సమావేశంలో చర్చించామని, 17 నుండి 25 వరకు దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించామని ఈవో పేర్కొన్నారు.

ఉత్సవాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలను అమలు చేస్తామన్న ఆయన ఆరడుగులు భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మూలాల నక్షత్రం రోజు సీఎం.జగన్ పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారని అన్నారు. మూల నక్షత్రం రోజున భక్తుల రద్దీని బట్టి కలెక్టర్ అనుమతి తో టిక్కెట్ లు ఆన్లైన్ లో పెంచే ఆలోచన చేస్తామని అన్నారు. ఈ సారి దసరా ఉత్సవాలకు 4 నుండి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ఈవో పేర్కొన్నారు..

Related posts