telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

 కూలిన నారాయణ కాలేజీ గోడ.. శిథిలాల కింద ఇరుకున్న ఆరుగురు విద్యార్థులు!

vijayawada narayana school seized

నారాయణ కాలేజీ లో ఓ గోడ అకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో విద్యార్థులు శిథిలాల కింద ఇరుక్కు పోయారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న నారాయణ కాలేజీ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరులోని అరవింద్ నగర్ లో ఓ భవంతిలో నారాయణ కాలేజీని నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు భవనానికి సంబంధించిన ఓ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది.

దీంతో ఆరుగురు విద్యార్థులు గోడ శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, కాలేజీ నిర్వాహకులు గాయపడ్డ విద్యార్థులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయనీ,ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

Related posts