telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసు : నిషేధించిన సీబీడీ ఆయిల్‌ ఆన్‌లైన్‌లో ఎలా దొరుకుతోంది ? – మీరాచోప్రా

Meera-chopra

బాలీవుడ్ నటి మీరా చోప్రా చేసిన తాజా ట్వీట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. “ఊరికే అడుగుతున్నాను. సీబీడీ ఆయిల్‌ని భారత్‌లో నిషేధించినప్పుడు అది ఆన్‌లైన్‌లో ఎలా అందుబాటులో ఉంది. ఇది అమెజాన్‌లో లభిస్తుంది. నేను చూశాను. నిషేధించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు” అంటూ మీరా చోప్రా ప్రశ్నించింది. సీబీడీ ఆయిల్‌ గంజాయి నుంచి లభిస్తుంది. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా సంచలన విషయాలను వెల్లడించింది. సుశాంత్, రియా చక్రవర్తితో పాటు తన కోసం కూడా సీబీడీ ఆయిల్‌ను ఆర్డర్ చేసినట్లు జయ సాహా అంగీకరించిందని సమాచారం. అలాగే రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా సీబీడి ఆయిల్‌ని సుశాంత్ తాగే టీలో నాలుగైదు చుక్కలు కలిపి ఇవ్వాలని, అలా అర గంటకోసారి ఇవ్వాలని సూచించానని జయసాహా తెలిపినట్లుగా సమాచారం. ఇక రియా లాయర్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో సీబీడి గురించి మాట్లాడారు. దీనిలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని బాటిల్‌ మీద ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రియా తన బెయిల్‌ పిటిషన్‌లో సుశాంత్‌కి మాదక ద్రవ్యాల అలవాటు ఉందని, అతని కోసం తాను అప్పుడప్పుడు చిన్న చిన్న పరిమాణంలో డ్రగ్స్‌ తీసుకున్నానని తెలిపింది. అయితే తాను డ్రగ్‌ సిండికేట్‌లో భాగం కానని రియా వెల్లడించింది. బాంబే హై కోర్టు ఈ రోజు ఆమె బెయిల్‌ పిటిషన్‌ని విచారించనుంది.

ఇక సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో బయటపడిన డ్రగ్స్‌ కోణంపై విచారణ వేగవంతం చేశారు అధికారులు. డ్రగ్స్‌ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకోనెలను ఎన్‌సీబీ విచారణకు పిలిచింది. వీరితోపాటు దీపికా మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా ప్రశ్నించడానికి పిలిచింది. రోజు (సెప్టెంబర్ 24) శ్రుతి మోడీ, సిమోన్ ఖంబట్టా, రకుల్ ప్రీత్‌లు ఎన్‌సీబీ దర్యాప్తుకు హాజరుకావాల్సి ఉంది. దీపికా పదుకొనేను సెప్టెంబర్ 25 (శుక్రవారం)న, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26 (శనివారం) దర్యాప్తుకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఇంకా డ్రగ్స్‌ లింకులతో సంబంధమున్న 25 మంది పేర్లను రియా వెల్లడించడంతో బాలీవుడ్ లో తీవ్ర కలకలం రేగుతోంది. వీరిలో కొందరు సీబీడీ ఆయిల్ ‌(కానబిడియోల్‌ ఆయిల్‌) వినియోగించినట్లు తెలుస్తోంది.

Related posts