telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోతో ఇంద్రగంటి భారీ సినిమాకు బ్రేకులు…”వి” సినిమా ఎఫెక్ట్…?

Indraganti

ఇటీవల నాని, సుధీర్‌బాబు నటించిన ‘వి’ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన సంగతి తెలిసిందే. సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. నాని, సుదీర్ బాబులు హీరోలుగా నటించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. మార్చిలోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ అప్పుడే దేశంలోకి కరొనా ఎంట్రీ ఇవ్వడంతో లాక్ డౌన్ లో భాగంగా ధియేటర్లు మూతపడ్డాయి. దీనితో సినిమాని సెప్టెంబర్ 05న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. అయితే సినిమాలో పెద్దగా కొత్తదనం కనిపించకపోవడంతో ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. అయితే ఈ సినిమా ఎఫెక్ట్ దర్శకుడు ఇంద్రగంటి పైన భారీగానే పడింది. ఈ సినిమా తర్వాత ఓ స్టార్ హీరోతో 70 నుంచి 80 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమాని చేయాలనీ అనుకున్నారట ఇంద్రగంటి. ఈ కథకి మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా ఒకే చెప్పారట. ఏమైందో ఏమో కానీ మైత్రి తప్పుకోవడంతో అదే కథని దిల్ రాజు చేయాలనీ అనుకున్నారట. ఇప్పుడు వి మూవీ ఎఫెక్ట్ తో ఏదైనా చిన్న సినిమాని ఇంద్రగంటి స్టైల్ లో లవ్ అండ్ కామెడీతో చేద్దామని దిల్ రాజు సలహా ఇచ్చారట. దీనితో ఇంద్రగంటి భారీ బడ్జెట్ మూవీ ఇప్పట్లో లేనట్టేనని ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విషయానికొస్తే తెలుగులో విభిన్నమైన చిత్రాలు చేసే దర్శకులలో ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన అష్టాచమ్మా, అంతకుముందు ఆ తరవాత, గోల్కొండ హై స్కూల్, సమ్మోహనం చిత్రాలు చాలా క్లాస్ సినిమాలు. అయితే ఇప్పుడు ఆయన రూట్ మార్చి ‘v’ అనే సినిమాని చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

Related posts