telugu navyamedia
సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” విడుదలకు ముహూర్తం ఖరారు

dear comrades movie schedule done at kakinada

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రంగా “డియర్ కామ్రేడ్”. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ, క్రికెటర్ గా రష్మిక నటిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. జూలై 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు చిత్రబృందం. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటనను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన “గీత గోవిందం” సంచలన విజయం సాధించడంతో, సహజంగానే “డియర్ కామ్రేడ్”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా అంచనాలను ఎంతమేరకు అందుకుంటుందో చూడాలి.

Related posts