సుహాస్ హీరోగా వస్తున్న”కలర్ ఫోటో” చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే జెర్సీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి మంచి మార్కులు కొట్టేసిన సుహాస్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు. ఇందులో సుహాస్ సరసన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ కమెడియన్ సునీల్ విలన్ గా నటిస్తున్నాడు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా, కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందించాడు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘హృదయ కాలేయం’ సాయి రాజేష్ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 23న విజయదశమి సందర్భంగా విడుదల చేయటానికి నిర్మాతలు ముహుర్తం ఖరారు చేశారు. అయితే ఇదే లాక్డౌన్లో ప్రేక్షకులకి దగ్గరయ్యి అందరి చేత ఆహ అనిపించుకున్న ‘ఆహ’ ఓటిటి ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల దగ్గరకి వస్తుంది. ‘ఎంటర్టైన్మెంట్ ఇంటికొచ్చి ఇస్తాం. మీ మొబైల్స్, టివి, లాప్టాప్లు మా కోసం ఆన్ చేయండి చాలు. ఇంటికి వచ్చి నవ్వించడం మాకు కొత్త కాదు’ అంటున్నారు దర్శకుడు సందీప్.
previous post
కారవాన్ అనేది కనీస అవసరాలకు మాత్రమే… చిరంజీవి, తమ్మారెడ్డి కామెంట్స్