telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏకంగా 200 దేశాల్లో “ఆకాశమే నీ హద్దురా” విడుదల

Akashame-ni-Haddura

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 30న విడుదల కానుందని సూర్య ప్రకటించాడు. తమిళంతో పాటు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమాను అమెజాన్ ఎక్కువ మొత్తానికే కొనుగోలు చేసిందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. సూర్య నిర్మాణ సంస్థకు కో ప్రొడ్యూసర్ అయిన రాజశేఖర్ పాండియన్ ఈ సినిమా భారీ ఎత్తున ఏకంగా 200ల దేశాల్లో విడుదల కానుంది అని తెలిపారు.

Related posts