రెండేళ్ళ విరామం తర్వాత “పింక్” మూవీ రీమేక్ “వకీల్ సాబ్”తో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమా తరవాత పవన్ కళ్యాణ్ తన 27వ సినిమాను క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని ఇప్పటికే మొదలు పెట్టేశాడు. ఈ సినిమా తరవాత హరీష్ శంకర్ డైరెక్షన్ లలో సినిమాలను చేసేందుకు సిద్దం అయ్యాడు పవన్. అయితే తాజాగా పవన్ మరో సినిమాకి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాడానికి పవన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా రైట్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దగ్గర ఉన్నాయి. ఇందులో పవన్ తో పాటుగా తమిళనటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తాడని సమాచారం. ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట. ఇక ఈ సినిమాకి తొలిప్రేమ, మిస్టర్ మజ్ను లాంటి లవ్ స్టోరీస్ చేసిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించానున్నాడని తెలుస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన రానుంది.. ఇక ఇదే సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ప్రస్తుతం వెంకీ అట్లూరి నితిన్ హీరోగా ‘రంగ్ దే’ అనే సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే.
previous post

