telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక సామాజిక

ఇకపై అప్పు ఈజీ… ఈ 6 ఆప్షన్లు ట్రై చేయండి

employee offering money to his lead

అవసరానికి బంధువులు లేదంటే స్నేహితుల దగ్గరి నుంచి డబ్బు అప్పు తీసుకుంటే దాని వల్ల ఎప్పటికైనా సమస్య ఎదురయ్యే అవకాశముంది. రిలేషన్‌షిప్ దెబ్బతినే ప్రమాదం కూడా రావొచ్చు. అందువల్ల మీకు డబ్బు అవసరమైతే బంధువులు, ఫ్రెండ్స్ వద్ద నుంచి అప్పు తీసుకోవడానికి దూరంగా ఉండటం మంచిది. మరీ అవసరం తీరేదెలా? అంటే… ఆరు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

1. Personal Loan: మీకు డబ్బు అవసరమైతే పర్సనల్ లోన్ తీసుకోండి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. ఈ రకమైన రుణాలు సులభంగానే పొందొచ్చు. దాదాపు 7 రోజుల్లో లోన్ వచ్చేస్తుంది. రూ.25,000 నుంచి లోన్ తీసుకోవచ్చు. వడ్డీ రేటు 11.5 శాతం నుంచి 16 శాతం మధ్యలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీని కన్నా ఎక్కువ ఉండొచ్చు. తీసుకున్న రుణ మొత్తాన్ని 5 ఏళ్లలో తిరిగి చెల్లించొచ్చు.

2. Payday Loan: నెల చివరిలో డబ్బు కొరత తీర్చేందుకు పేడే లోన్స్ లేదా మైక్రో లోన్స్ ఉపయోగపడతాయి. తీసుకున్న రుణాన్ని 3 నెలల్లోగా చెల్లించాలి. రూ.1,500 నుంచి రూ.లక్ష వరకు రుణం పొందొచ్చు. పలు ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ఇలాంటి రుణాలు అందిస్తుంటాయి. వడ్డీ రేటు రోజుకు 0.8 శాతం నుంచి 2 శాతం మధ్యలో ఉంటుంది.

3. Credit Card-linked Pre-approved Loan: ఈ తరహా రుణాలు క్రెడిట్ కార్డుతో లింక్ అయ్యి ఉంటాయి. క్రెడిట్ కార్డు లిమిట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుంటే ఆ మొత్తం మీ క్రెడిట్ కార్డు నుంచి కట్ అవుతుంది. ఈఎంఐ ప్రతి నెలా మీ కార్డు బిల్లుతో కలిసి వస్తుంది. ఇలాంటి రుణాలను వేగంగానే పొందొచ్చు. వడ్డీ రేటు 12 శాతం నుంచి 29 శాతం మధ్యలో ఉండొచ్చు.

4. Gold Loan: చాలా బ్యాంకులు బంగారంపై రుణాలు అందిస్తున్నాయి. అలాగే ఎన్‌బీఎఫ్‌సీలు కూడా గోల్డ్ లోన్స్ మంజూరు చేస్తున్నాయి. బంగారంపై రుణాలు త్వరితగతిన లభిస్తాయి. వడ్డీ రేటు 12 శాతం నుంచి 16 శాతం మధ్యలో ఉండొచ్చు. తక్కువ డాక్యుమెంట్లతోనే రుణం పొందొచ్చు.

5. Loan Against Insurance Policies: మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారా? అయితే ఇక్కడ మీకు ఒక ప్రయోజనం ఉంది. పాలసీ మీద లోన్ కూడా తీసుకోవచ్చు. పాలసీపై లోన్ తీసుకోవాలని భావిస్తే బ్యాంకులు మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ వంటి వాటిని కూడా పట్టించుకోవు. పాలసీ సరండర్ వ్యాల్యూలో 60 నుంచి 90 శాతం మొత్తాన్ని రుణంగా పొందొచ్చు. వడ్డీ రేటు 9.25 శాతం నుంచి 13 శాతం మధ్యలో ఉండొచ్చు.

6. Loan against Fixed Deposits: బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? అయితే వీటిపై కూడా రుణం పొందొచ్చు. ఎఫ్‌డీ మొత్తంలో ఏకంగా 90 శాతాన్ని రుణం కింద తీసుకోవచ్చు. అలాగే ఈ తరహా రుణాలపై వడ్డీ రేటు తక్కువగగా ఉంటుంది. సిబిల్ స్కోర్‌తో అవసరం ఉండదు. అలాగే తక్కువ డాక్యుమెంట్లతోనే లోన్ వచ్చేస్తుంది.

Related posts