ప్రముఖ బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుత రావు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ -19 వైరస్‌తో పోరాడి మరణించారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. అచ్చుతరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అచ్యుత రావు బాలల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ, ఎంతో మంది బాల కార్మికులను పాఠశాలలో చేర్చి విద్యార్థులుగా మరిచిన ఘనత అచ్చుతరావుకే సొంతం. పేద పిల్లల కోసం ఎంతో కష్టపడే తత్వం ఉన్న గొప్ప వ్యక్తి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కర్మాగారాలు, హోటళ్ళు మరియు ప్రైవేట్ గృహాలలో నుంచి బాల కార్మికులను, వందలాది మంది పిల్లలను రక్షించడంలో అచ్యుత రావు పాత్ర మరువలేనిది. బాధలో ఉన్న పిల్లలను ఆదుకోవడంలో అచ్యుత రావు తన స్వరాన్ని నిర్భయంగా విన్పించారు. బాలల హక్కుల సంఘం అధ్యక్షుడుగా అచ్యుత రావు, అతని భార్య అనురాధ, పిల్లల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసిన వారి సహచరుల లక్ష్యం బాలల హక్కులను కాపాడి వారు విద్యావంతులు కావడానికి, కొత్త జీవితాన్ని గడపడానికి సహాయం చేయడమే. గతంలో చైల్డ్ ట్రాఫికింగ్ మరియు రెస్క్యూ మిషన్లపై మిస్టర్ రావు ఎన్డిటివితో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. పిల్లల హాని కలిగించే పరిస్థితులను బహిర్గతం చేసే నివేదికలకు ముఖ్యమైన ఇన్పుట్లను అందించడం ద్వారా బాల్య వివాహాలను ఆపడానికి సహాయపడ్డారు.
previous post


టూరిజం బోట్లలో మంత్రులకు వాటాలు: మాజీ ఎంపీ హర్షకుమార్