telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

నగల కోసం రిటైర్డ్ వైద్యాధికారిణి దారుణ హత్య

Crime

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఓ రిటైర్డ్ వైద్యాధికారిని దారుణంగా గొంతు కోసి హతమార్చారు. ఇంట్లో ఉండే నగలతో పారిపోయారు. మండలంలోని మంగళం కొత్త పేటకు చెందిన కృష్ణవేణమ్మ భర్త చాలా ఏళ్ల క్రితమే కాలం చేయగా, ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు హైదరాబాదులో మరొకరు బెంగళూరులో స్థిరపడ్డారు. కృష్ణవేణమ్మ వైద్య ఆరోగ్య శాఖలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం సొంతూరులోనే ఓ క్లినిక్ ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పనిమనిషి ఇంటి వద్దకు రాగా తలుపు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా కృష్ణవేణమ్మ రక్తపుమడుగులో మృతి చెంది కనిపించింది. వెంటనే ఆమె పక్కింట్లో ఉండే కృష్ణవేణమ్మ బంధువులకు విషయం తెలిపింది. వారి సమాచారంతో పాకాల సీఐ ఆశీర్వాదం, కల్లూరు ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లో ని నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను తొందర్లోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా కృష్ణవేణమ్మ గ్రామంలో పలువురికి వడ్డీకి డబ్బు ఇచ్చేదని, ఆమెను సొమ్ము కోసమే హతమార్చి ఉంటారని తెలుస్తోంది.

Related posts