telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనా నేపథ్యంలో.. ఇక వాట్సాప్‌లో కోర్టు సమన్లు!

cell phone

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో వినూత్న మార్పులు చేస్తున్నారు. వైరస్ నుంచి దూరంగా ఉండేందుకు పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. మీటింగుల కోసం జూమ్, జియోమీట్, గూగుల్ మీట్‌ వంటివి పుట్టుకొచ్చాయి. ఇక, పెళ్లిళ్లు, శుభకార్యాల రూపు కూడా క్రమంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు భావిస్తోంది.

ఇకపై కోర్టు సమన్లు, నోటీసులను ఈ-మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ వంటి వాటి ద్వారా పంపించ వచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి, జిస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారుల ఇబ్బందులను పరిశీలించిన ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Related posts