telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

yadagiari reddy mla

తెలంగాణలో కోవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 164 కేసులు నమోదయ్యాయి. జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ అనుమానంతో ముత్తిరెడ్డి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్టు వైద్యులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే కరోనా బారినపడడం ఇదే తొలిసారి. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇటీవల కరోనా బారినపడినప్పటికీ కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,484 కేసులు నమోదు కాగా, 174 మంది మరణించారు. 2,032 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Related posts