telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గౌతమ్, మహేష్ బాబు హైట్ చెక్ వీడియో వైరల్

mahesh

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగులకు దూరమవడంతో ఫ్యామిలీతో ఉంటున్నారు. లాక్‌డౌన్ వ‌ల‌న పూర్తిగా ఇంటికే ప‌రిమిత‌మ‌యిన మ‌హేష్ ఈ అమూల్య‌మైన స‌మ‌యాన్ని కొడుకు గౌత‌మ్‌, కూతురు సితార‌తో గ‌డుపుతున్నారు. పిల్ల‌ల‌తో ఆట‌పాట‌లాడుతూ మ‌హేష్ చేసే ఫ‌న్ నెటిజ‌న్స్‌కి మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇటీవ‌ల త‌న‌యుడితో క‌ళ్ళ‌ల్లో క‌ళ్లు పెట్టి చూస్తూ ఓ గేమ్ ఆడిన మ‌హేష్ తాజాగా త‌న గౌత‌మ్‌తో క‌లిసి హైట్ చెక్ చేసుకున్నాడు. ఇద్ద‌రిలో ఎవ‌రు హైట్ అని చేసుకుంటుండ‌గా, గౌత‌మ్ న‌వ్వుతూనే ఉన్నాడు. దాదాపు తండ్రి హైట్ పెరిగిన గౌత‌మ్‌ని చూసి ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మే 31న మ‌హేష్ త‌దుప‌రి ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

Related posts