తీన్మార్ సినిమాలో పవన్‌తో రొమాన్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతి కర్భందా. ఆ తరువాత పరాజయాలు పలకరించడంతో బాలీవుడ్ వెళ్లిపోయింది. విచిత్రంగా అక్కడ ఈ భామకు వరస ఛాన్సులు వస్తున్నాయి. దాంతో అక్కడే సెటిల్ అయిపోయింది కృతి. గతేడాది హౌజ్ ఫుల్ 4, పాగల్ పంటి సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు పర్లేదనిపించాయి.. దాంతో అమ్మడికి మంచి టైమ్ నడుస్తుంది. ఇదిలా ఉంటే సినిమాలతో పాటు ఎఫైర్స్‌తో కూడా బాగానే నడిపిస్తుది కృతి. ఈమె ప్రస్తుతం బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో వీళ్లిద్దరిపై ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఇదే తమ ప్రేమకు గుర్తు అన్నట్లుగా మీడియాకు దొరికిపోతున్నారు. పైగా ఈ ఇద్దరూ పాగల్ పంటి సినిమాలో కలిసి నటించారు కూడా. అన్నింటికి మించి ఇదే విషయాన్ని కృతిని అడిగితే.. నిజమే తాను ఓ హీరోతో ప్రేమలో ఉన్నానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.
previous post
నాకు మందు అలవాటు ఉంది… కానీ… : శ్రీముఖి