విభిన్నమైన పాత్రలతో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది నయనతార. ఈమె ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చిందట. ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ, ఆరంభంలో నటన పట్ల తనకి పెద్దగా ఆసక్తి ఉండేది కాదని చెప్పడం విశేషం. ఒకప్పుడు నాకు సినిమాలంటే ఇష్టం లేదు. ఇంక నటన అంటే ఏకోశానా ఆసక్తి, ఇష్టమూ రెండూ లేవు. చదువుకుంటూనే మోడలింగ్ చేసేదాన్ని. 2003లో ఓ మలయాళీ సినిమాలో అవకాశమొచ్చింది. ముందు చేయననే అన్నాను. కానీ ఆ సినిమా దర్శకనిర్మాతలు నచ్చచెప్పడంతో ఒక్క సినిమా మాత్రమే చేయాలని నిర్ణయించుకుని ఆ సినిమా చేశాను. ఆ సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా మంచి వసూళ్ళను రాబట్టింది. ఆ సంవత్సరంలో దాదాపు ఎనిమిది సినిమాలకు ఓకే చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాను. మధ్యలో నా వ్యక్తిగత కారణాల వలన సినిమాలకు కొద్దిగా దూరమయ్యాను తప్ప అవకాశాలు లేక మాత్రం కాదు అని నయనతార చెప్పుకొచ్చింది.