లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకు పరిమితమైన సెలబ్రిటీలు వర్కౌట్స్, కుకింగ్, ఇంటి పనులు ఇలా ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సెలబ్రిటీల విషయం పక్కన పెడితే వారి పనిమనుషులేం తక్కువ కాదు అన్నట్టు బాలీవుడ్ నటి అర్చన పురాన్ సింగ్ ఇంటి పని మనిషి వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న అర్చన ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గుడుపుతున్నారు. ఈ క్రమంలో తన ఇంటి పని మనిషి భాగ్యశ్రీ ఫన్నీ వీడియోలను తరచూ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా మరో వీడియోను అర్చన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. పని మనిషి భాగ్యశ్రీ పని చేస్తూ.. ఒక్కసారిగా పెద్దగా నవ్వడంతో.. ఎందుకు నవ్వావని అర్చన అడిగారు. వెంటనే భాగ్యశ్రీ టీవీలో వస్తున్న జోక్కి నవ్వాను అని చెప్పింది. అలాగే నువ్వు ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉండడానికి కారణమేంటని అర్చన, భాగ్యశ్రీని అడగ్గా ‘మీ హ్యాపీ ఫ్యామిలీలో భాగమైనందు వల్లే ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నానని చెప్పింది. అలాగే భాగ్యశ్రీ డ్రెస్ గురించి అర్చనా అడగ్గా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిందామె. అర్చన పురాన్ సింగ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అర్చన షేర్ చేసే వీడియోలతో భాగ్యశ్రీ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది.
previous post