telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కట్టడికి చేస్తున్న కృషి అభినందనీయం: మంత్రి వెల్లంపల్లి

srinivasa rao minister

కరోనా కట్టడికి ప్రభుత్వాధికారులు, మానవతావాదులు చేస్తున్న కృషి అభినందనీయమని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడ నగరంలోని రాజరాజేశ్వరి పేట కరోనా పాజిటివ్‌ కంటోన్మెంట్‌ జోన్‌ ప్రాంతంలో మంత్రి బుధవారం పర్యటించారు. డ్రోన్‌తో సోడియం హైడ్రో క్లోరైడ్‌ చల్లించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేస్తున్న సిబ్బందిలో మనో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి ఇంటిపట్టునే ఉండాలని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చినవారు స్వచ్చంధంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పిలుపు ఇచ్చారు.

Related posts