తాను ఏ పార్టీలో ఉన్నా, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఇటీవల తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన ఓ బహిరంగా లేఖను రాశారు. పలు విషయాలపై ఆయన తన మనసులోని మాటను ఈ లేఖలో వివరించారు.’మిత్రులు, శ్రేయోభిలాషులకు… నేను డొక్కా మాణిక్య వరప్రసాద్ రాస్తున్న బహిరంగ లేఖ అని ప్రారంభించిన ఆయన పలు విష్యాలు వెల్లడించారు.
సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన విమర్శలు బాధించాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపానని, అయితే, ఆ పార్టీ నేతలతో మాత్రం చర్చించలేదని స్పష్టం చేశారు. తనపై నీతి బాహ్యమైన, చౌకబారు విమర్శలు చేస్తున్నారని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తన ప్రవర్తన ప్రజలకు సుస్పష్టమని అన్నారు.


విభజన చట్టంలోని హామీలకు బడ్జెట్లో ప్రతిపాదనలు లేవు: ఎంపీ ప్రభాకర్ రెడ్డి