తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని వీఎస్‌టీ-ఆర్టీసీ కల్యాణ మండపం రోడ్డులో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌లో కేసీఆర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు తన ఫొటోను కూడా ముఠా గోపాల్ పొందుపరిచారు.
ప్రధాన రోడ్డుపక్కనే ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్‌ను చూసిన ఓ వ్యక్తి దానిని ఫొటో తీసి సీఈసీ-ఈవీడీఎం ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. వెంటనే స్పందించిన ఈవీడీఎం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కటౌట్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు రూ.5 వేల జరిమానా విధించారు.
జగన్ నవరత్నాలు పంచుతాడో లేదో చూస్తా: కేఏ పాల్