హైదరాబాద్‌లో నగరంలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపట్టినట్టు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
కరోనా వైరస్‌పై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రైళ్లలో అనౌన్స్మెంట్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే, రైళ్లలో ప్రజలు తాకే అవకాశం ఉన్న ప్రతి చోటా ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కాబట్టి మెట్రో ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.


ప్రజల విశ్వాసాన్ని వైసీపీ పొందలేకపోతుంది: పురందేశ్వరి