telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అతడిపై అనవసర అభియోగాల మోపొద్దు… నా విడాకులతో అతనికేం సంబంధం… : అమలాపాల్

Amala-Paul

బోల్డ్ బ్యూటీ అమలాపాల్ తాజాగా తన విడాకులకు సంబంధించి ఘూటు వ్యాఖ్యలు చేసింది. తన మాజీ మామకు లేటుగా, కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చింది అమలాపాల్. “విడాకులు తీసుకోవడం తన సొంత అభిప్రాయం. అందుకు ఎవరూ కారణం కాదు. అసలు ఒకరి కారణంగా వివాహాన్ని ఎవరైనా రద్దు చేసుకుంటారా ? ధనుష్ ఎప్పుడూ నా మంచి కోరుకునే వ్యక్తి… అతడిపై అనవసర అభియోగాల మోపొద్దు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు పదే, పదే ప్రస్తావించవద్దు. కొన్ని పర్సనల్ విషయాలకు పరిధులు ఉంటాయి” అంటూ మండిపడింది. కాగా ప్రస్తుతం ఈ నటి లీడ్ రోల్‌లో నటించిన ‘అదో అందపరవై పోల’ త్వరలో రిలీజ్‌కు సిద్దమైంది. మరోవైపు మహేశ్‌భట్‌ తెరకెక్కించనున్న ‘పర్వీన్‌ బాబీ’ బయోపిక్‌తో అమలాపాల్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. గతంలో అమలా.. డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత ఇద్దరూ మనస్పర్థలు కారణంగా రెండేళ్లకే విడిపోయారు. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. ఇటీవల విజయ్‌ తండ్రి, నిర్మాత, నటుడు అళగప్పన్‌ అమలాపాల్‌‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. విజయ్-అమలాపాల్ విడిపోవడానికి హీరో ధనుషే కారణం అంటూ బాంబు పేల్చారు. ‘అమ్మ కణక్కు’ మూవీలో నటించమని ధనుష్, అమలాను కోరాడని, ఆమె అందుకు ఒప్పుకోవడం కూడా వెంటనే జరిగిపోవడంతో విజయ్ హర్టయ్యాడని అళగప్పన్‌ చెప్పారు. అంతకుముందు పెళ్లి తర్వాత సినిమాల్లో నటించనని చెప్పిన అమలాపాల్ .. మాట మీద నిలబడకపోవడమే మనస్పర్థలకు కారణమన్నారు ఆయన. ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి.

Related posts