telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఖైదీ” రీమేక్ లో హృతిక్…?

Hrithik

కార్తీ నటించిన ‘ఖైదీ’ గ‌త ఏడాది దీపావళి కానుకగా తమిళ్, తెలుగులో రిలీజ్ అయి ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. చిత్రంలో కార్తీ నటన, లోకేష్ కనకరాజ్ గ్రిప్పింగ్‌గా కథ చెప్పిన విధానం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ రిలీజ్ చేయగా… ఫస్ట్ డే నుండి ఈ చిత్రానికి భారీ వ‌సూళ్లు ల‌భించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఖైదీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. హృతిక్ రోష‌న్ ఇందులో లీడ్ రోల్ పోషించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఖైదీ ఒరిజిన‌ల్ వ‌ర్షెన్ చూసిన హృతిక్ రీమేక్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. కాగా, హృతిక్ ఇటీవ‌ల వార్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Related posts