బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఐదు పదుల వయస్సులోను ఫుల్ స్పీడుతో సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు షాకిస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అయిందో లేదో వెంటనే మరో సినిమా మొదలు పెట్టేస్తున్నాడు. ఈ ఏడాది అక్షయ్ కుమార్.. కేసరి, బ్లాంక్, మిషన్ మంగళ్, హౌజ్‌ఫుల్ 4,గుడ్ న్యూస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్, పృథ్వీరాజ్ చిత్రాలు విడుదల కావలసి ఉంది. తాజాగా అక్షయ్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. “అత్రంగి రే” అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ధనుష్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి హిమాన్షు శర్మ కథ అందించారు. మార్చిలో సెట్స్ పైకి వెళ్ళనుంది ఈ చిత్రం . వచ్చే ఏడాది ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14)న ప్రేక్షకుల ముందుకు రానుంది.
.@akshaykumar, @dhanushkraja, #SaraAliKhan Starrer #AtrangiRe Directed by @aanandlrai announced.
An @arrahman musical
Releasing on Valentine’s Day, 2021#HimanshuSharma @cypplOfficial #CapeOfGoodFilms @itsBhushanKumar @TSeries pic.twitter.com/lxofeEef6i— BARaju (@baraju_SuperHit) January 30, 2020