telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాధే శ్యామ్ : ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బుట్టబొమ్మ

Radhe-Shyam

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. భాగ్యశ్రీ, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, సత్యన్, శాషా ఛేత్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా లాక్‌డౌన్ తరవాత ఇటలీలో షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో ఇటలీ షెడ్యూల్‌ను ప్రారంభించింది చిత్ర యూనిట్. ముందుగా ప్రభాస్ అండ్ కో ఇటలీ వెల్లగా.. అక్టోబర్ మొదటి వారంలో పూజా హెగ్డే జాయిన్ అయ్యారు. సుమారు నెల రోజులపాటు అక్కడ షూటింగ్‌లో పాల్గొన్న పూజా తన భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. తాను ఇటలీ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్నట్టు పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిజయేశారు. ‘‘రాధే శ్యామ్ ఇటాలియన్ షెడ్యూల్‌ను నేను పూర్తిచేశాను. ఈ షెడ్యూల్‌ను విజయవంతం చేసిన టీమ్‌కు ధన్యవాదాలు. హైదరాబాద్‌లో కలుద్దాం ప్రభాస్’’ అని పూజా హెగ్డే తన స్టోరీలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇటలీలో జరుగుతోన్న షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ త్వరలోనే పూర్తిచేయనుందని సమాచారం. అది పూర్తికాగానే టీమ్ మొత్తం హైదరాబాద్ చేరుకుంటుంది. ఆ తరవాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్‌లో మళ్లీ పూజా హెగ్డే పాల్గొంటారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ షెడ్యూల్‌ ఉంటుంది.

Related posts