telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టీ20 ప్రపంచకప్‌ భారత్ లో వద్దు…

ఐపీఎల్ 2021 లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో ఐపీఎల్ 2021ను బీసీసీఐ వాయిదా వేసింది. తాజాగా దీని పై ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ఒకవేళ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించడం.. భారత వనరులను దెబ్బతీసినా లేదా సురక్షితమైంది కాదని తెలిసినా దాన్ని యూఏఈకి తరలించడం మంచిదని నేను అనుకుంటున్నా. ఆ మెగా ఈవెంట్‌కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. భారతీయులకు ఏది మంచిదనే విషయంపై క్రికెట్‌ వర్గాలు ప్రభుత్వంతో చర్చలు జరపడం ముఖ్యం’ అని అన్నాడు. గతేడాది యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ అద్భుతంగా జరిగింది. అక్కడ బాగా నిర్వహించారు. కానీ చాలా మంది దాన్ని భారత్‌లోనే నిర్వహించాలని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అందరి అభిప్రాయం తెలుసుకొని ఇక్కడే కొనసాగించారు’ అని అన్నాడు. ఐపీఎల్‌ను వాయిదా వేయడంతో విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్, బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇంటికి చేరుకున్నారు. అయితే కొంతమంది ఆటగాళ్లకు స్వదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పడం లేదు.

Related posts