ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా ఉండేందుకే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతూ ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ అమరావతి పేర చంద్రబాబు జోలె పట్టి నాటకాలాడుతున్నారని ఆరోపించారు.
హైకోర్టును కర్నూలులో, సెక్రటేరియట్ ను విశాఖలో, శాసనసభను అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారన్నారు. వారు చేస్తున్న ఉద్యమం అభివృద్ధికోసం కాదని, ఆస్తుల కోసమని దుయ్యబట్టారు.ప్రభుత్వం న్యాయంగా నిర్ణయంచేసి దానికి తగ్గ పరిహారం రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.