బాలీవుడ్ హీరోయిన్, ఐటెం గర్ల్ మలైకా అరోరా. ఒక బిడ్డకు తల్లైన 46 ఏళ్ల మలైక.. భర్త నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది. గత ఏడాది వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయాన్నీ మీడియా ముఖంగా ప్రకటించారు. వీరిద్దరూ తరచుగా విదేశీ యాత్రలకు వెళ్తుంటారు. అక్కడ సన్నిహితంగా కలిసి దిగిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన మలైక.. అర్జున్‌తో వివాహం గురించి స్పందించింది. “నాకిప్పుడే వివాహం చేసుకోవాలని లేదు. అది ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడు జరుగుతుంది. మేం ఇప్పుడు మా రిలేషన్షిప్లో నిజాయితీగా ఉన్నాం. సమయం వచ్చినప్పు అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటాం. ఈ ఏడాది నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. నా వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాను. అందుకోసం నా టీమ్‌తో కలిసి ప్రణాళికలు వేసుకుంటున్నాను” అని మలైక చెప్పుకొచ్చింది.
previous post