కింగ్ నాగార్జున చివరిగా “మన్మథుడు-2” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం అక్కినేని అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం నాగ్ “వైల్డ్ డాగ్” అనే చిత్రాన్ని చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అహిషోర్ సాల్మోన్ దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జున వైల్డ్‌డాగ్ విజయ్ వర్మ అనే పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా నాగార్జున మరో ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ప్రకటన వచ్చింది. గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుండగా, ఇందులో నాగ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా కనిపిస్తారట. ఈ సినిమా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రైడ్ మాదిరిగానే ఉంటుంది అంటున్నారు. ప్రవీణ్ సత్తారు సొంత కథతోనే ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుండగా, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
previous post