స్పెయిన్‌లోని ఆర్టీవీఈ అనే న్యూస్ చానెల్లో నటాలియా అనే మహిళ రిపోర్టర్‌గా పనిచేస్తోంది. క్రిస్ట్మస్ సందర్భంగా నిర్వహించిన ఓ లాటరీలో నటాలియా పాల్గొనగా ఆమెకు లాటరీ వరించింది. తనకు నాలుగు మిలియన్ యూరోల(దాదాపు రూ. 32 కోట్లు) లాటరీ వరించిందని నటాలియా తెగ ఆనందపడిపోయింది. మీడియా ముందు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ సంబరం చేసుకుంది. ఇక తనకు పనిచేసే అవసరం కూడా లేదంటూ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. అయితే లాటరీ విజేతల పేర్లను ప్రకటించిన సెకన్ల వ్యవధిలోనే నటాలియా ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. అప్పటి వరకు ఆనందంతో వచ్చిన కన్నీళ్లు.. ఒక్కసారిగా బాధతో రావడం మొదలయ్యాయి. ఎందుకంటే లాటరీలో నటాలియా గెలుచుకుంది కేవలం 5 వేల యూరోలు (దాదాపు రూ. నాలుగు లక్షలు) మాత్రమే. తనకు తగిలిన లాటరీ ధర తెలుసుకోగా.. నటాలియా ఆనందానికి ఒక్కసారిగా బ్రేకులు పడినట్టు అయింది. ఉద్యోగానికి రానని చెప్పి తాను ఎంత పెద్ద తప్పు చేశానోనని నటాలియా అర్థం చేసుకుంది. కాగా, ఈ వార్త సోషల్ మీడియాలోనూ తెగ హల్ చల్ చేస్తోంది.
previous post
రోహిత్ శర్మను ఔట్ చేయడం డ్రీం… : పాకిస్థాన్ యంగ్ ప్లేయర్ నసీమ్ షా