భారత విలు విద్య క్రీడాకారిణులు దీపిక, అనికితలు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అద్భుతం సృష్టించారు. వ్యక్తిగత రికర్వు ఈవెంట్లో స్వర్ణం, రజతం పతకాలను దక్కించుకున్నారు. ఒకవైపు మాత్రమే సాగిన ఈ పోరులో దీపికా కుమారి 6-0 తేడాతో అనికిత భకత్‌పై విజయం సాధించిం బంగారు పతకాన్ని గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన అనికితకు రజతం దక్కింది.
ఈ ఛాంపియన్షిప్ సెమీస్‌కు చేరడంతోనే వీరివురూ ఒలంపిక్స్ వ్యక్తిగత రికర్వు ఈవెంట్‌కు అర్హత పొందారు. అంతేకాకుండా సెమీస్‌లో వియత్నంకు చెందిన గుయెత్ డు తి అన్ను దీపిక, భూటాన్‌కు చెందిన కర్మను అనికిత ఓడించారు.