రాయలసీమ పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ లో స్పందించారు.1996లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రచురించిన పుస్తకాన్ని పోస్ట్ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయల సీమ లోనే అని పేర్కొన్నారు. పౌరహక్కుల వారు ప్రచురించిన ఈ పుస్తకంలో అనేక చేదు నిజాలు బయటకి వచ్చాయి.
రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ, దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి, వలసలు వెళ్లి పోతున్నారని పేర్కొన్నారు. రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమవుతుంది’ అని పవన్ ట్వీట్ చేశారు. పౌరహక్కుల సంఘం పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుంది. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయల సీమలోనే అని పేర్కొన్నారు.


టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యం: మంత్రి కన్నబాబు