ప్రముఖ నటి, దర్శకురాలు, రచయిత్రి అయిన రేణు దేశాయ్… పవన్ నుంచి విడిపోయిన తరువాత పుణే వెళ్లిపోయి మరాఠి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కూడా ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. రేణు దేశాయ్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చాలా మందికి తెలిసిందే. రేణు ఒక మంచి కవియిత్రి కూడా. రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఆమె చేసే పోస్టులన్నీ తనకు, తన పిల్లలకు సంబంధించినవే ఉంటాయి. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత పిల్లలతో కలిసి పుణే వెళ్లిపోయిన రేణు దేశాయ్ అక్కడ సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవలే ఆమె ఒంటరిగా మాల్దీవులు విహారయాత్రకు కూడా వెళ్లొచ్చారు. అక్కడ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే, తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. ఇది ఒక వీడియో. ఈ వీడియోలో రేణు దేశాయ్ ఐరన్ మ్యాన్ గ్లోవ్‌ని చేతికి తొడుక్కుని ఉన్నారు. ఆ గ్లోవ్‌ను ఐరన్ మ్యాన్ మాదిరిగానే ఆడిస్తూ కెమెరాకు చూపించారు. రేణు వెనుక నుంచి ఆమె కుమార్తె ఆధ్య స్లో మోషన్లో గంతులేస్తూ వెళ్లింది. ఈ పోస్ట్‌కు ఆసక్తికర కోట్ కూడా పెట్టారు రేణు. ‘‘నేను ఐరన్ మ్యాన్. ఈ వీడియో నాకెంతగానో నచ్చింది. ఆధ్య ఫొటోబాంబింగ్ ఎంత బాగుందో. రాబర్ట్ డౌనీ జూనియర్ కన్నా కచ్చితంగా నేను క్యూటర్ ఐరన్ మ్యాన్’’ రేణు పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
previous post