ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మోహన్ బాబు ట్విట్టర్ లో “చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా మనసును గాయపరిచావు. అన్న యన్. టి. ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!” అంటూ వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లను చూస్తుంటే మోహన్ బాబు బాగానే హర్ట్ అయినట్టున్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					

