telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఆగని ఇసుక మరణాలు.. మరో ఇద్దరు తాపీ మేస్త్రీల ఆత్మహత్య

New couples attack SR Nagar

ఇసుక కొరతతో పనుల్లేక మరో ఇద్దరు తాపీ మేస్త్రీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీనీ అమలు చేయడంతో ఇసుక కొరత ఏర్పడింది. దీంతో గడచిన ఐదు నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేకుండా పోయాయి. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో వారు సతమతమవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే కొందరు ఆత్మహత్యలకు పాల్పడారు.

తాజాగా గుంటూరు జిల్లాలో మరో ఇద్దరు బలవంతంగా ప్రాణం తీసుకున్నారు. జిల్లాలోని పొన్నూరు గ్రామానికి చెందిన ఆడపా రవి పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. దీంతో ఈరోజు పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే తాడేపల్లి మండలం ఉండవల్లిలో కూడా మరో తాపీ మేస్త్రీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతను కూడా ఆర్థిక ఇబ్బందులతో కొటూమిట్టాడుతూ భవిష్యత్తు అర్థంకాక బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Related posts