telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి అంత‌మొందించారు..

Nara Lokesh

నర్సీపట్నం ప్రాంతీయ వైద్యశాలలో అనస్థీషియన్ గా పనిచేస్తూ సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ కరోనా ప్రారంభ సమయంలో మాస్కు లు లేవని ప్రభుత్వం పై విమర్శలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. సస్పెన్షన్ సమయంలో సుధాకర్ సంచలనం సృష్టించింది సుధాకర్ వ్యవహారం. డాక్టర్ సుధాకర్ మానసిక పరిస్థితి బాలేదంటూ కొన్నాళ్ళు విశాఖ మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించారు. ఈ సుధాకర్ వ్యవహారంపై గతంలో సీబీఐ విచారణ జరిగింది. అయితే డాక్టర్ సుధాకర్ గారి మృతి న‌న్ను తీవ్ర‌దిగ్ర్భాంతికి గురిచేసింది అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మాస్క్ అడగ‌డ‌మే ద‌ళిత వైద్యుడు చేసిన నేరంగా జ‌గ‌న్‌రెడ్డి ఆదేశాల‌తో రెక్క‌లు విరిచి క‌ట్టి, కొట్టి, నానా హింస‌లు పెట్టి పిచ్చాసుప‌త్రిలో చేర్పించ‌డంతో సుధాక‌ర్ బాగా కుంగిపోయార‌ని తెలిసింది. ఒక సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి చివ‌రికి ఇలా అంత‌మొందించారు. ఇది గుండెపోటు కాదు. ప్ర‌శ్నించినందుకు ప్ర‌భుత్వం చేసిన హ‌త్య ఇది. నిరంకుశ స‌ర్కారుపై పోరాడిన సుధాక‌ర్‌ గారికి నివాళి అర్పిస్తున్నాను.ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలిపారు.

Related posts