స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. ఆమె నటనాపరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా యూత్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మెరుపుతీగ బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ను గత సంవత్సరం పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ చివరకు వివాహం చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ పై కూడా వీరిద్దరూ సూపర్ హిట్ జోడిగా నిలిచారు. కాగా దీపికా సినిమాల విషయానికొస్తే… గ్లామర్ రోల్సే కాదు పౌరాణిక పాత్రలలోను ఇట్టే ఒదిగిపోతుంది. బాజీరావ్ మస్తానీ చిత్రంలో మస్తానీగా అలరించిన దీపికా.. పద్మావత్ చిత్రంలో రాణిగా కనిపించింది. ఇక త్వరలో తెరకెక్కనున్న మహాభారత్ చిత్రంలో ద్రౌపది పాత్ర పోషించనుంది. కట్ చేస్తే కాశ్మీర్‌లోని లోహారా రాజవంశం రాజు సహదేవుని కమాండర్ ఇన్ చీఫ్ రామచంద్ర కుమార్తె కోట రాణి జీవిత నేపథ్యంలో నటించేందుకు దీపికా సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీపికా దగ్గర స్నేహితుడు మధు మంతెన ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాకపోయినప్పటికి అభిమానులలో మాత్రం విస్తృత చర్చ జరుగుతుంది. ప్రస్తుతం దీపికా పదుకొణే చపాక్, 83 అనే ప్రాజెక్టులతో బిజీగా ఉంది. షకున్ బత్ర తెరకెక్కించనున్న చిత్రంలోను రణ్‌భీర్ కపూర్‌తో కలిసి నటించనుంది దీపికా.
previous post
next post