telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కండక్టర్‌పై లైంగిక దాడికి యత్నించిన తాత్కాలిక డ్రైవర్!

passengers fire on tsrtc buses shortage

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక సిబ్బందిని నియమించారు. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో ప్రస్తుతం బస్సులను నడుపుతున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ప్రయాణికులను ఎక్కించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, పథకం ప్రకారం లైంగిక దాడికి యత్నించాడు.

అయితే.. ఆ మహిళా కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగినట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాత్కాలిక డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

Related posts