telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కొరటాల-చిరు సినిమాలో .. అవకాశం కొట్టేసిన గెటప్ శీను..

jabardasth srinu got chance in chiru movie

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ ఐన గెటప్ శీను సినిమాల్లో కూడా చాలా అవకాశాలు దక్కించుకున్నాడు . తాజాగా గెటప్ శీను బంపర్ ఆఫర్ కొట్టేసాడు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో గెటప్ శీను ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన లేనప్పటికీ గెటప్ శ్రీను మాత్రం సంకేతాలు అందాయని స్వయంగా వెల్లడించాడు. ఇటీవలె జబర్దస్త్ టీంతో చిరంజీవిని గెటప్ శీను కలిసేందుకు వెళ్ళినప్పుడు… కొరటాల శివ సినిమాలో నీకు ఒక మంచి పాత్రని అనుకున్నారని మెగాస్టార్ చిరంజీవి చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని తెలిపాడు గెటప్ శ్రీను.

మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమాలో నటించడం కంటే అదృష్టం ఏముంటుందని గెటప్ శీను తెలిపాడు. అయితే అధికారికంగా మాత్రం ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉందని గెటప్ శీను తెలిపాడు. ఇదిలా ఉంటే ఇటీవలే మెగా బ్రదర్ జబర్దస్త్ జడ్జి నాగబాబు కూడా గెటప్ శీను పై ప్రశంసల వర్షం కురిపించాడు. గెటప్ శ్రీను లాంటి నటుడిని ఇండస్ట్రీ వాడుకోకపోతే నష్టపోతుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నటించగల సత్తా గెటప్ శీను ఉందని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశాడు మెగా బ్రదర్ నాగబాబు. ప్రస్తుతం గెటప్ శ్రీను త్రి మంకీస్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Related posts