telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రియ బీచ్ డ్యాన్స్… వీడియో వైరల్

Shriya

2001లో ‘”ఇష్టం” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ శరణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. 18 ఏళ్లుగా స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ 2018లో ఆండ్రీ కొశ్చెవ్‌ని రాజ‌స్థాన్‌లో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్ళి త‌ర్వాత సినిమాల‌ని పూర్తిగా త‌గ్గించేసింది. చివ‌రిగా “గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి” చిత్రంతో ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు ఇప్పుడు ప‌లు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం హిందీలో “తడ్కా” , తమిళంలో “నరగాసురన్”, “సండకారి” సినిమాలలో నటిస్తోంది. అయితే శ్రియ సోష‌ల్ మీడియాను శ్రియా బాగానే ఉప‌యోగించుకుంటుంది. గ్లామ‌ర్ ఫొటోల‌ను, వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ కుర్ర‌కారును, అభిమానులను ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ అమ్మ‌డు పోస్ట్ చేసిన బీచ్ డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Related posts